గన్నారం 33/11 కేవీ సబ్ స్టేషన్ ను తనిఖీ చేసిన సీఎండి

ఇందల్వాయి, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ సరఫరా, అంతరాయంలో ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించడానికి ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ సిఎండి వరుణ్ రెడ్డి క్షేత్రస్థాయి పర్యటన చేశారు. గురువారం ఇందల్వాయి మండలం గన్నారం గ్రామంలోని 33/11 కేవీ సబ్ స్టేషన్ పరిశీలించారు. సంబంధిత సబ్ స్టేషన్ లో విద్యుత్ సరఫరా, మరమ్మత్తులు, పునరుద్ధరణ పై స్థానిక సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అత్యవసర సేవలలో కీలకమైన విద్యుత్ శాఖలో సిబ్బంది అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలకు రైతులకు...