Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 August 2025, 10:48 pm Posted by : ramakrishna

గన్నారం 33/11 కేవీ సబ్ స్టేషన్ ను తనిఖీ చేసిన సీఎండి

ఇందల్వాయి, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ సరఫరా, అంతరాయంలో ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించడానికి ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ సిఎండి వరుణ్ రెడ్డి క్షేత్రస్థాయి పర్యటన చేశారు. గురువారం ఇందల్వాయి మండలం గన్నారం గ్రామంలోని 33/11 కేవీ సబ్ స్టేషన్ పరిశీలించారు. సంబంధిత సబ్ స్టేషన్ లో విద్యుత్ సరఫరా, మరమ్మత్తులు, పునరుద్ధరణ పై స్థానిక సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అత్యవసర సేవలలో కీలకమైన విద్యుత్ శాఖలో సిబ్బంది అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలకు రైతులకు విద్యుత్ సేవలను మెరుగైన సేవలు అందించాలని కోరారు. ఎన్పీడీసీఎల్ సిఎండి వెంట  నిజామాబాద్ విద్యుత్ శాఖ సర్కిల్ ఆపరేషన్ సూపరింటెండెంట్ రవీందర్ తో పాటు డిఈలు, ఏఈలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

CMD inspects Gannaram 33/11 KV substation