హైదరాబాద్, బతుకమ్మ : ఎల్లారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు కె. మదన్ మోహన్ రావు జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి ఆయనకు ’ఎక్స్‘ వేదికగా హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు.