సావు భాష తప్ప సాగుపై సోయి లేని సీఎం : హరీశ్ రావు

వెబ్ న్యూస్, బతుకమ్మ :  సావు భాష తప్ప సాగుపై  సోయి లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే రైతుల బతుకులు క్యూ లైన్లలో తెల్లారాల్సిందే అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు.  ఈమేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ’ అందరినీ తొక్కుకుంటూ వచ్చాను అని గర్వంగా చెప్పుకునే రేవంత్ రెడ్డి, నీ చెత్త పాలనతో ఇప్పుడు రైతులనే తొక్కుతున్నావు. నీ చిల్లర రాజకీయాలకు, నీ విధ్వంసకర పాలనకు బలైపోతున్నది రైతే. రైతులకు సమయానికి యూరియా కూడా అందించలేని నువ్వు...