Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 June 2026, 9:08 pm Posted by : ramakrishna

అరణ్య అర్బన్ పార్కును వర్చువల్ గా ప్రారంభోత్సవం చేసిన సీ.ఎం

 

. . . పాల్గొన్న ఎమ్మెల్యే, కలెక్టర్

 

. . . వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు, అధికారులు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నిజామాబాద్ నగర శివారులో గల మాక్లూర్ మండలం చిన్నాపూర్ వద్ద ఏర్పాటు చేసిన అరణ్య అర్బన్ పార్క్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి వర్చువల్ పద్ధతిలో గురువారం గుర్రంగూడ నుండి లాంఛనంగా ప్రారంభించారు. ఆర్మూర్ శాసన సభ్యులు పైడి రాకేష్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అర్పన, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, వి. భుజంగ రావు, అదనపు డీసీపీ శుభం ప్రకాష్ నగ్రాలే, జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ తదితరులు అరణ్య అర్బన్ పార్క్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. సఫారీ వాహనంలో పర్యటించి అర్బన్ పార్క్ లో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. ఓపెన్ జిమ్ లు, వాకింగ్ ట్రాక్, ప్లే జోన్ ఏరియా, కల్వర్టులు, పర్కులేషన్ ట్యాంకులు, వాచ్ టవర్, సోలార్ ద్వారా నడిచే బోరుబావులు, రోడ్డు వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, అటవీ ప్రాంతాన్ని కాపాడడానికి ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ అధికారులు, సిబ్బంది అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. పచ్చదనాన్ని పెంపొందిస్తూ, వాతావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు, ప్రజలకు ఆహ్లాదం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అటవీ ప్రాంత అభివృద్ధి కోసం ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ఇందులో భాగంగానే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో అటవీ శాఖ కార్యక్రమాలను సైతం ప్రభుత్వం కొనసాగించిందని గుర్తు చేశారు. మొక్కల పెంపకం ఆవశ్యకతను ప్రతి ఒక్కరూ గుర్తెరిగి విరివిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించేలా కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

 

CM virtually inaugurated the Aranya Urban Park.

 

చెట్లు నరకడం ఎంతో సులభం అని, కానీ పర్యావరణానికి,  ప్రాణికోటికి ఎంతో మేలు చేకూర్చే మొక్కలు నాటి, వాటిని కాపాడడం గురించి ఎంతో మంది తమకు ఎందుకులే అని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందరి భాగస్వామ్యం ఉన్నప్పుడే, పచ్చదనం పెంపొందించబడుతుందని అన్నారు. జిల్లాలో అటవీ శాఖ పరంగా చేపట్టే కార్యక్రమాలకు. జిల్లా యంత్రాంగం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఆర్మూర్ శాసన సభ్యులు పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ, 63వ నెంబర్ జాతీయ రహదారికి ఆనుకుని, నిజామాబాద్ నగరానికి ఐదు కిలోమీటర్ల దూరంలోనే 476 ఎకరాల విస్తీర్ణంలో అరణ్య అర్బన్ పార్క్ ప్రజలకు అందుబాటులోకి రావడం ఎంతో సంతోషం కలిగించిందని అన్నారు. దైనందిన కార్యకలాపాలతో అలసిన వారికి అర్బన్ పార్క్ ఆహ్లాదం పంచుతుందని, వ్యాయామం చేసుకునే వారికి మరింత వెసులుబాటు ఏర్పడిందని అన్నారు. అర్బన్ పార్క్ లో మరిన్ని వసతులు అందుబాటులో తెచ్చేలా జిల్లా యంత్రాంగం చొరవ చూపాలని అన్నారు. అర్బన్ పార్క్ లో అసాంఘిక శక్తులకు ప్రవేశం లేకుండా గట్టి నిఘా ఉంచాలని అటవీ అధికారులకు సూచించారు. అటవీ ప్రాంత సంరక్షణ, విస్తీర్ణం పెంపొందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. పచ్చదనం పెంపొందించే కార్యక్రమాల్లో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని, పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని సూచించారు. అడవులకు నష్టం కలిగించే వారి పట్ల అటవీశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ సాయన్న, డీఎఫ్ఓ సుధాకర్, సర్పంచ్ లు కే.లత, గంగాధర్, చిన్నా, విద్యార్థిని, విద్యార్థులు, అటవీ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

 

CM virtually inaugurated the Aranya Urban Park.