Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 August 2026, 8:35 pm Posted by : ramakrishna

జ్యోతిరావు పూలే, సావిత్రీబాయి పూలే విగ్రహాలను ఆవిష్కరించిన సీఎం

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

సామాజిక సంస్కర్తలు, విద్యా ప్రదాతలు మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రీబాయి పూలే దంపతుల విగ్రహాలను తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని హెచ్ఎండీఏ గ్రౌండ్స్ ఎదురుగా ఏర్పాటు చేసిన విగ్రహాలను సీఎం ఆవిష్కరించి, మహనీయులకు పుష్పాంజలి ఘటించారు. సమాజంలో సమానత్వం, విద్య, మహిళా సాధికారత కోసం పూలే దంపతులు చేసిన సేవలను ఈ సందర్భంగా నాయకులు స్మరించుకున్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి, ముఖ్యంగా మహిళల విద్యాభివృద్ధికి సావిత్రీబాయి పూలే చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీసీ సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

 

CM unveils statues of Jyotirao Phule and Savitribai Phule.