ఇందల్వాయి,బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఉదయం మండల పరిషత్ అభివృద్ధి అధికారి లక్ష్మారెడ్డి,తాసిల్దార్ వెంకట్రావులు రెండు రోజులుగా జరగనున్న సీఎం కప్ క్రీడ పోటీలను ప్రారంభించారు. జాతీయ జెండాతో విద్యార్థుల గౌరవ వందనం చూపరులను ఆకట్టుకుంది. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు ఆటపాటలలో అన్ని రంగాలలో ముందుండాలని కోరారు. భవిష్యత్తులో చదువుతో పాటు ఆటలు పాటలు అవసరమని అన్నారు. క్రీడలలో ఆట పోటీలలో గెలుపోటములు సహజమని పేర్కొన్నారు. ఆటలలో ఓడినవారు మానసికంగా నిరుత్సాహపడకుండా ప్రయత్నం చేస్తే విజయం తమనే వరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. సీఎం కప్ ఆట పోటీలలో మండలంలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన పాఠశాలల విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ చింతలపల్లి గోవర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోత్కూరి నవీన్ గౌడ్, డిసిసిబి డైరెక్టర్ కోరట్ పల్లి ఆనంద్, వీడీసీ చైర్మన్ జితేందర్, ఎక్స్ సిఎంసి చైర్మన్, మాజీ సర్పంచ్ అరిపల్లి దశరథ్ , పిఎసిఎస్ మాజీ చైర్మన్ గోపాల్, పాఠశాల హెడ్మాస్టర్ లక్ష్మీనాథం, సహచార ప్రధానోపాధ్యాయులు, క్రీడాకారులు,గ్రామస్తులు,యవకులు,తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
