- మాటలు కోటలు దాటితే, చేతలు గడప దాటడం లేదు
- మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
హైదరాబాద్, బతుకమ్మ : ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పదవులను త్యజించి, అలుపెరుగని ఉద్యమం చేసి, తనను వరించిన ఎన్నో పదవులను తృనప్రాయంగా త్యాగం చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన, అదే తెలంగాకు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి గా పని చేసి, రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్ గా నిలిపిన కేసీఆర్ ను చావు కోరుతూ మాట్లాడిన సీ. ఎం రేవంత్ రెడ్డి కి అబద్దాలతో పాటు అమర్యాదే ఆభరణాలుగా ఆగుపిస్తున్నాయని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. సీ. ఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ చావును కోరుతూ ఆయన నోటికి వచ్చినట్లు స్ట్రెచరని, మార్చురీ అని జూగుప్సకరంగా,అమర్యాదగా మాట్లాడడాన్ని నిరసిస్తూ శనివారం అసెంబ్లీలో సీ. ఎం ప్రసంగాన్ని బహిష్కరించి, బీయర్ ఎస్ శాసన సభ పక్షం వాకౌట్ చేసింది. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వేముల మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు అబద్దాలు చెప్పి సీ. ఎం అయిన రేవంత్ రెడ్డి అబద్దాలు మాత్రమే మాట్లాడుతారు అనుకుంటే అసెంబ్లీ సాక్షిగా ఆయన అమర్యాద మాటలను ప్రజలందరు చూశారని అన్నారు. మూడు గంటల పాటు సీ. ఎం చేసిన గవర్నర్ రిప్లై ప్రసంగంలో ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటిలు, 420 హామీలపై స్పస్థత లేకపోగా, వంద సార్లు కేసీ ఆర్ నామస్మరణ, బీజెపీ కేంద్ర ప్రభుత్వం పై ప్రశంసలు కురిపించారని ఆయన ఏద్దేవా చేశారు.ఐదు శతబ్దలుగా అసెంబ్లీ లో కొనసాగుతున్న ప్రతిపక్ష నేత (ఎల్. ఓ. పి) ఛాంబార్ ను కేటాయించకుండా కేసీ ఆర్ పై అక్కసు తో లాక్కొని ప్రతిపక్షాన్ని అగౌరవ పరిచరని ఆరోపించారు. అంతే కాకుండా పీ ఏ సీ చైర్మన్ ను ప్రతిపక్ష నేత సూచిన వారిని నియమించాల్సింది పోయి సీ. ఎం బీయర్ ఎస్ నుండి కాంగ్రెస్ కు మారిన వ్యక్తిని సాంప్రదాయానికి విరుద్దంగా నియమించుకొన్నాడని అన్నారు. అన్ని విషయాల్లో సీ. ఎం మాటలు కోటలు దాటుతున్నాయని, చేతలు మాత్రం ఇంటి కడుప దాటి బయటి వెళ్లడం లేదని ఆయన విమర్శించారు.అసెంబ్లీ లో ఆర్ధిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క రుణ మాఫీ విషయంలో కానిస్టెన్సీ వారిగా చెప్పిన లెక్కలు తప్పుడు లెక్కలు చెబుతున్నారని, నా నియోజక వర్గంలో అప్పటి బీయర్ ఎస్ ప్రభుత్వం చేసిన రుణ మాఫీ కంటే ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ తక్కువే నని అన్నారు. ఒకవేళ ఇప్పటివరకు ఈ ప్రభుత్వం చేసిన రుణమాఫీ బీయర్ ఎస్ ప్రభుత్వం కంటే ఎక్కవ చేసినట్లయితే తన పదవికి రాజీనామా చేస్తానని వేముల సవాల్ విసిరారు. అప్పటి బీయర్ ఎస్ ప్రభుత్వం రెండు విడుతల రూ. 29వేల కోట్ల రుణ మాఫీ చేసిందని, ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు విడుతల రూ. 21వేల కోట్ల రుణమాఫీ చేసారన్నారు.ఎవరైనా సంస్కారం లేకుండా మాట్లాడితే కేసులు చేస్తామని చెప్పిన సీ. ఎం యే తొడ్కాల్ తీస్తా,బట్టలు ఊడదీసి కొడతా అంటూ సంస్కారం లేకుండా మాట్లాడితే కేసులు ఎవరు చేయాలని, ఎవరిపై న చేయాలని ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు.