పెండింగ్ స్కాలర్షిప్ నిధులు విడుదల చేయాలని సీఎం రేవంత్ ఇల్లు ముట్టడి
నిజామాబాద్ జిల్లా పీడీఎస్ యూ నాయకుల అరెస్ట్ హైదరాబాద్, బతుకమ్మ : పెండింగ్ లో ఉన్న రూ. 7500 కోట్లకు పైగా ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్షిప్ నిధులను వెంటనే విడుదల చేయాలని హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని సోమవారం పీడీఎస్ యూ నాయకులు ముట్టడించారు. ఈసందర్భంగా పీడీఎస్ యూ నాయకులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. అనంతరం వీరిని అరెస్ట్ చేసి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్టయిన వారిలో నిజామాబాద్ జిల్లా పీడీఎస్...