మాదిగలకు ఇచ్చిన మాటను సీఎం రేవంత్ నిలబెట్టుకోవాలి

నిజామాబాద్, బతుకమ్మ : మాదిగలకు అసెంబ్లీలో ఇచ్చిన మాటను సీఎం రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ అన్నారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ ధర్నా చౌక్ ఎదుట ఎమ్మార్పీఎస్ నాయకులు మంగళవారం నిరసన దీక్షలు చేపట్టారు. ఈదీక్షలను ఎంఈఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు తెడ్డు గంగారాం మాదిగ ప్రారంభించారు. ఈసందర్భంగా కనక ప్రమోద్ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ చట్టం అమలు తర్వాతే గ్రూప్- 1,2, 3, పరీక్షల...