Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 March 2025, 2:58 pm Posted by : ramakrishna

మాదిగలకు ఇచ్చిన మాటను సీఎం రేవంత్ నిలబెట్టుకోవాలి

నిజామాబాద్, బతుకమ్మ : మాదిగలకు అసెంబ్లీలో ఇచ్చిన మాటను సీఎం రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ అన్నారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ ధర్నా చౌక్ ఎదుట ఎమ్మార్పీఎస్ నాయకులు మంగళవారం నిరసన దీక్షలు చేపట్టారు. ఈదీక్షలను ఎంఈఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు తెడ్డు గంగారాం మాదిగ ప్రారంభించారు. ఈసందర్భంగా కనక ప్రమోద్ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ చట్టం అమలు తర్వాతే గ్రూప్- 1,2, 3, పరీక్షల ఫలితాల విడుదల, నియాకాలు చేపట్టాలన్నారు. గ్రూప్స్ పరీక్షల ఫలితాల విడుదల విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈవిషయమై సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మిత అయ్యాల్వర్ సంక్షేమ సంఘం టౌన్ అధ్యక్షులు సుదర్శన్, ఎంఎస్పీ జిల్లా సీనియర్ నాయకులు గంధమల్ల నాగభూషణం మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు రొడ్డ ప్రవీణ్ మాదిగ, ఎంఎంఎస్ జాతీయ నాయకురాలు యమున మాదిగ, సత్తెక్క, ఎమ్మర్పీఎస్ టౌన్ అధ్యక్షులు మహేష్ మాదిగ, ఎంఎస్పీ టౌన్ సీనియర్ నాయకులు రామచందర్ మాదిగ, నిజామాబాద్ రూరల్ మండల అధ్యక్షులు కార్కా సాయులు మాదిగ, ఎమ్మార్పీఎస్ నందిపేట మండల కన్వీనర్ పైడకుల ప్రశాంత్ మాదిగ, ఎంఎస్ఎఫ్ నాయకులు చరణ్ మాదిగ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.