బతుకమ్మ, మోర్తాడ్: మోర్తాడ్ మండలంలోని శేట్ పల్లీ గ్రామంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులకు రెండు లక్షల రుణ మాఫీ చేసినందుకుగాను సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముత్యాల రాములు మాట్లాడుతూ ప్రతి పల్లెల్లో రైతుల సంతోషంగా సంబరాలు జరుపుకుంటున్నారంటే ముఖ్యమంత్రి రైతుల కష్టాలను తీర్చడం కోసం చేసిన రుణమాఫీ వల్ల ఎంతో మంది రైతు జీవితాల్లో సంతోషంగా ఉన్నారని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షుడు గురిజాల నర్సారెడ్డి , బబ్బురి నవీన్, బద్దం దేవేందర్, డొంకల్ అనిల్, రైతులు పుప్పల రాజు, శ్రీనివాస్, ఆనంద్, లింబన్న, సాయన్న రైతులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.