Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 November 2024, 4:14 pm Posted by : ramakrishna

అభయ హస్తం కాలనీలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

బతుకమ్మ నిజామాబాద్ అర్బన్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు నిజామాబాద్ నగరంలోని అభయహస్తం కాలనీలో మల్యాల గోవర్ధన్, ధ్యారంగుల కృష్ణ ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకొని కాలనీ ప్రజలు సంబరాలు చేసుకున్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మల్యాల గోవర్ధన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం హాత్ సే హాత్ జోడో పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించి ప్రజలను చైతన్యపరిచి, గడీల పాలనను కూల్చివేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో ఆయన కృషి అమోఘమైనది ఉన్నారు. ముఖ్యమంత్రిగా ప్రజా పాలనలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఇచ్చిన హామీల అమలు కోసం నిబద్ధతతో పనిచేస్తున్నారని అందులో భాగంగానే ప్రజల సొంత ఇంటి కలను నెరవేర్చడంలో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేయడం, అభయ హస్తం పేరుతో ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నారని అన్నారు.
ఆయన స్ఫూర్తి తోటి సంక్షేమ పథకాలకు పెట్టిన పేరునే నివాస ప్రాంతాల కాలోని కి “అభయ హస్తం కాలనీ”గా నామకరణం చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అభయహస్తం కాలనీ ప్రజలు లక్ష్మణ్, మున్వర్, గంగాధర్, మంజుల, కల్పన, లక్ష్మి, లావణ్య, అఖిల్, అమీర్, రాజు, సుశాంత్ తదితరులు పాల్గొన్నారు.

CM Revanth Reddy's birthday celebrations were grand in Abhaya Hastam Colony