ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
బతుకమ్మ, ఏర్గట్ల : మండల కేంద్రంలో బస్టాండ్ తెలంగాణ తల్లి,చత్రపతి శివాజీ విగ్రహాల వద్ద మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒకరినొకరు స్వీట్లు తినిపించుకుంటూ టపాకాయలు కాల్చి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవిస్తూ తెలంగాణ ప్రజలకు మరెన్నో అభివృద్ధి పథకాలు వర్తింపజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ...