Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 November 2025, 4:48 pm Posted by : ramakrishna

ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

బతుకమ్మ, ఏర్గట్ల : మండల కేంద్రంలో బస్టాండ్ తెలంగాణ తల్లి,చత్రపతి శివాజీ విగ్రహాల వద్ద మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒకరినొకరు స్వీట్లు తినిపించుకుంటూ టపాకాయలు కాల్చి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవిస్తూ తెలంగాణ ప్రజలకు మరెన్నో అభివృద్ధి పథకాలు వర్తింపజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గంగ ప్రసాద్, డిసిసి డెలికేట్ గడ్డం జీవన్ రెడ్డి, ఏర్గట్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేండ్ల రాజారెడ్డి, మూస్కు మోహన్ రెడ్డి,రేండ్ల రమేష్, బద్దం లింగారెడ్డి, పన్నాల నర్సారెడ్డి, రోక్కెడ సంజీవ్,మండల కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షుడు మునీర్,మునిమాణిక్యం అజయ్,కూరాకుల బోర్రన్న, సుదనవేని శ్రీనివాస్ గౌడ్, ప్రసాద్ గౌడ్, మండల పరిధిలో ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గ్రామపార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.