Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 August 2026, 5:10 pm Posted by : ramakrishna

విదేశీ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి

 

. . . షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసిన ఏసీబీ కోర్టు

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదిత విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. ఈ నెల 17 నుంచి సెప్టెంబర్ 10 వరకు యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే), అమెరికా (యూఎస్), జర్మనీ, చైనా దేశాల్లో పర్యటించేందుకు అనుమతి కోరుతూ సీఎం కోర్టును ఆశ్రయించారు. ఓటుకు నోటు కేసులో జప్తు చేసిన తన పాస్‌పోర్టును తాత్కాలికంగా విడుదల చేయాలని, అలాగే బెయిల్ నిబంధనలను సడలించాలని రేవంత్ రెడ్డి కోర్టును కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ఏసీబీ కోర్టు పలు షరతులతో అనుమతి మంజూరు చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం, రేవంత్ రెడ్డి రూ.1 లక్ష విలువైన ష్యూరిటీ సమర్పించాలి. అలాగే విదేశాల్లో బస చేసే చిరునామా, సంప్రదింపు వివరాల ను కోర్టుకు అందజేయాలని సూచించింది. విదేశీ పర్యటన ముగిసిన అనంతరం సెప్టెంబర్ 18లోగా పాస్‌పోర్టును తిరిగి కోర్టుకు అప్పగిస్తానని అఫిడవిట్ సమర్పించాలని కూడా ఆదేశించింది. ఈ షరతులను పాటిస్తూ రేవంత్ రెడ్డి తన విదేశీ పర్యటనను కొనసాగించేందుకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది.

 

CM Revanth Reddy to visit abroad