Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 January 2026, 8:19 pm Posted by : ramakrishna

6న నిజామాబాద్ కు సీఎం రేవంత్ రెడ్డి రాక

. . . బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించిన నాయకులు

 

నిజామాబాద్, బతుకమ్మ :

 

రాష్ట్రంలో బల్ధియా ఎన్నికల నేపథ్యంలో జిల్లాల పర్యటన చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లా పర్యటన ఖరారు అయింది. ఫిబ్రవరి 6న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి రానున్నారని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులు  సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డిలు తెలిపారు. ఈ నేపథ్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు నిజామాబాద్ రూరల్ మండలం కేశపూర్ గ్రామ శివారులోని ప్రైవేట్ స్థలాన్ని సోమవారం పరిశీలించారు.

CM Revanth Reddy to arrive in Nizamabad on 6th

ఈ నెల 27 లేదా 28న మున్సిపల్ ఎన్నికల నగారా మోగడం ఖాయమైంది. ఇది వరకు జిల్లాల పర్యటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి రాకపోవడంతో బల్ధియా ఎన్నికల ప్రచారం కోసం రప్పిస్తున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హుందాన్, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

CM Revanth Reddy to arrive in Nizamabad on 6th