సీఎం రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకోవాలి
కామారెడ్డి, బతుకమ్మ : మాస్లర్ ప్లాన్ ను రద్దు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ డిమాండ్ చేసింది. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని టెక్రియాల్ గ్రామంలో మాస్లర్ ప్లాన్ బాధిత గ్రామాల రైతులు సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మాస్టర్ ప్లాన్ ను రద్దు చేస్తామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపారు. తాము అధికారంలోకి వస్తే మాస్టర్ ప్లాన్ ను రద్దు చేస్తామని ఎన్నికల సమయంలో...