తుంగభద్ర జలాలపై కేంద్ర జోక్యం కోరిన సీఎం రేవంత్ రెడ్డి

  హైదరాబాద్, బతుకమ్మ :   తుంగభద్ర జలాల్లో తెలంగాణకు హక్కుగా రావాల్సిన నికర వాటా నీటి వినియోగం కోసం కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. భాగస్వామ్య రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలతో సమన్వయం సాధించి తెలంగాణకు న్యాయమైన వాటా అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. జలసౌధలో తుంగభద్ర ప్రాజెక్టు, రాజోలి బండ డైవర్సన్ స్కీమ్ (ఆర్డీఎస్), అంతర్రాష్ట్ర నదీ జల వివాదాలపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి ఈ అంశాలను ప్రస్తావించారు. ఈ...