ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

ఢిల్లీ, బతుకమ్మ : ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి  ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీతో ఢిల్లీలో శ‌నివారం భేటీ అయ్యారు. ఈ సంద‌ర్బంగా ముఖ్య‌మంత్రి ప్ర‌ధాన‌మంత్రి దృష్టికి పలు అంశాలు తీసుకెళ్లారు. హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-II, ఫేజ్-Iలో మూడు కారిడార్లు ఉన్నాయి (69 కిమీ). ఫేజ్-I ప్రాజెక్ట్‌ను రూ. 22,000 కోట్లతో నిర్మించారు. నగరంలోని ఇతర ప్రాంతాలకు మెట్రోను త‌క్ష‌ణం విస్త‌రించాల్సిన అవ‌స‌రం ఉందన్నారు. గత 10 ఏళ్లలో ఉన్న ప్రభుత్వం ఎలాంటి విస్తరణ చేపట్టలేదని, ప్రస్తుత ప్రభుత్వం ఫేజ్-II విస్తరణకు ప్రతిపాదనలు సమర్పించిందని తెలిపారు....