Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 August 2025, 12:28 pm Posted by : ramakrishna

ఓయూలో హాస్టల్ భవనాలు ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, బతుకమ్మ :  హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి  పలు అభివృద్ధి  పనులను సోమవారం ప్రారంభించారు. దుందుబి, భీమా అనే హాస్టల్ భవనాలను ప్రారంభించారు.  రూ.10 కోట్లతో డిజిటల్ లైబ్రరీ రీడింగ్ పనులకు శ్రీకారం చుట్టారు.  వర్సిటీలో పెద్దఎత్తున పెండింగ్ పోస్టులు భర్తీ కాకుండా ఉన్నాయి. అలాగే  వర్సిటీ సమస్యలను  విద్యార్థులు సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నారు. రేవంత్ రెడ్డి ఓ యూ పర్యటన సందర్భంగా పలువురు బీఆర్ఎస్వీ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు.