సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మదన్ మోహన్‌ చిత్ర పటాలకు పాలాభిషేకం

  ఎల్లారెడ్డి, బతుకమ్మ :   ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్‌ చిత్ర పటాలకు ఘనంగా పాలాభిషేకం నిర్వహించారు. ఇటీవల అడవి లింగాల గేట్, లింగంపల్లి ప్రాంతాల్లో అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న వంతెనల పునర్నిర్మాణానికి ప్రభుత్వం నుంచి సుమారు రూ. 8.5 కోట్ల నిధులు మంజూరు చేయించడంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ చేసిన కృషికి గుర్తింపుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మొన్న కురిసిన అకాల వర్షాల వల్ల...