విధి నిర్వహణలో మరణించిన వారికి బీమా చెక్కులు అందజేసిన సీఎం

  వెబ్ డెస్క్, బతుకమ్మ :   విద్యుత్ శాఖలో పనిచేస్తూ విధి నిర్వహణలో మరణించిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 1 కోటి రూపాయల చొప్పున ప్రమాద బీమా చెక్కులు అందజేశారు. మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకొచ్చిన విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క ని ఈ సందర్భంగా సీఎం అభినందించారు. విద్యుత్ శాఖలో పనిచేస్తూ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఓర్సు సురేష్, ముఖ్తార్ బేగ్ కుటుంబ సభ్యులకు 1 కోటి రూపాయల చొప్పున చెక్కులు అందజేశారు....