Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 May 2025, 7:06 pm Posted by : ramakrishna

సరస్వతీ నది పుష్కర స్నానమాచరించిన సీఎం, మంత్రులు

కాళేశ్వరం, బతుకమ్మ : జయశంకర్ భూపాల పల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రంలోని త్రివేణి సంగమంలో సరస్కతి నది పుష్కరాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ సరస్వతీ నది పుష్కరస్నానమాచరించారు. అనంతరం నదీ మాతకు హారతి ఇచ్చారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 10అడుగుల సరస్వతి దేవి విగ్రహాన్ని, భక్తుల వసతి కోసం నిర్మించిన 86 గదుల సముదాయాన్ని సీఎం ప్రారంభించారు.