కొడంగల్ బాలాజీ దేవస్థాన పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన సీఎం
కొడంగల్, బతుకమ్మ : పేదల తిరుపతిగా ఖ్యాతి పొందిన కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలోని శ్రీ మహాలక్ష్మీ వెంకటేశ్వరస్వామి (కొడంగల్ బాలాజీ) ఆలయ పునర్నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వేదపండితుల సమక్షంలో నిర్వహించిన భూమి పూజ, యాగంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అనంతరం కొడంగల్ బాలాజీ ఆలయ పునర్నిర్మాణంతో పాటు కొడంగల్ లో 430 పడకల ఆసుపత్రి నిర్మాణం, దౌల్తాబాద్ వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణం, కోస్గి వేణుగోపాలస్వామి ఆలయాల అభివృద్ధి పనులకు...