మక్తల్ – నారాయణపేట – కోడంగల్ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించిన సీఎం
నారాయణపేట, బతుకమ్మ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మక్తల్–నారాయణపేట–కోడంగల్ ఎత్తిపోతల పథకం (ఎంఎన్‌కెఎల్‌ఐఎస్) పనుల పురోగతిని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచిస్తూ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కొనసాగుతున్న నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించేందుకు బెంగళూరు నుంచి నారాయణపేట జిల్లాలోని మక్తల్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి, ముందుగా ప్రాజెక్టుకు సంబంధించిన ఫోటో ప్రదర్శనను వీక్షించారు. అనంతరం ప్రాజెక్టు ప్లాన్ మ్యాప్‌లను పరిశీలించి, వివిధ...