బాపూఘాట్‌లో మహాత్మా గాంధీకి సీఎం, గవర్నర్, పీసీసీ ఘన నివాళులు

  హైదరాబాద్, బతుకమ్మ :   జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా బాపూఘాట్‌లో  సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్  శివ ప్రతాప్ శుక్లా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సత్యం, అహింస, సహనం, మానవత్వం, సామాజిక బాధ్యత వంటి మహోన్నత విలువలను ఆచరించి, వాటి శక్తిని ప్రపంచానికి చాటిన మహాత్మా గాంధీ జీవితం యావత్ మానవాళికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.అహింసను...