సన్న బియ్యం లబ్ధిదారుడి ఇంట్లో సీఎం భోజనం
వెబ్ న్యూస్, బతుకమ్మ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు.ఈ సందర్భంగా సన్న బియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేశారు. రాష్ట్రంలోని ప్రతి నిరుపేద సన్నబియ్యంతో అన్నం తినాలన్న లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా సన్నబియ్యం పంపిణీని ప్రారంభించిన నేపథ్యంలో ఒక లబ్దిదారుడి ఇంట్లో ఆ కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్వయంగా సహపంక్తి భోజనం చేశారు. భద్రాచలం శ్రీ సీతారామ స్వామి కల్యాణ మహోత్సవంలో పాల్గొన్న అనంతరం బూర్గంపాడు మండలం సారపాకలో సన్నబియ్యం...