సీఎం కప్ క్రీడా పోటీలు ప్రారంభం
నిజాంసాగర్, బతుకమ్మ : నిజాం సాగర్ మండల కేంద్రంలోని జవహర్ లాల్ నవోదయ విద్యాలయంలో మండల స్థాయి సీఎం కప్ క్రీడా పోటీల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిట్లం ఏఎంసి చైర్మన్ చికోటి మనోజ్ కుమార్ హాజరయ్యారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు ఎంతో ముఖ్యమని క్రీడలను నేర్చుకోవడం వలన మండల స్థాయి నుంచి డివిజన్, జిల్లా, రాష్ట్రా స్థాయి పోటీలలో పాల్గొని మంచి భవిష్యత్తును పొందవచ్చు అని తెలిపారు. తదుపరి క్రీడల్లో విజయం పొందిన టీములకు బహుమతులను అందజేశారు...