Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 January 2026, 8:06 pm Posted by : ramakrishna

భిక్కనూరులో ఘనంగా సీఎం కప్ ప్రారంభం

. . . క్రీడలతోనే చెడు వ్యసనాలకు దూరం

 

. . . సోషల్ మీడియాకు దూరంగా ఉండండి గ్రంధాల సంస్థ చైర్మన్

 

భిక్కనూరు, బతుకమ్మ :

 

భిక్కనూరు మండల కేంద్రంలో రెండవ వార్షిక సీఎం కప్ క్రీడల పోటీలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ విద్యార్థులను గ్రామస్థాయి నుండి ఒలంపిక్ స్థాయికి తీసుకెళ్లేలా సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని యువత మత్తు పదార్థాలకు, చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా ఉండాలంటే క్రీడలపై దృష్టి సాధించాలని సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని హితవు పలికారు. మండలంలోని హై స్కూళ్ళకు గ్రంథాలయాలను సర్పంచుల సహకారంతో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం వాలీబాల్ ఆడుతున్న చిన్నారులతో కరచలనం చేస్తూ ఉత్సాహంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రాజాగంగారెడ్డి ఎంపీడీవో రాజ్ కిరణ్  రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు భీమ్ రెడ్డి, యూత్ ప్రెసిడెంట్ శ్రీరామ్ వెంకటేష్, సర్పంచ్ బాల్యాల రేఖ సుదర్శన్, పంచాయతీ కార్యదర్శి మహేష్ కుమార్ గౌడ్, పీడీలు విద్యార్థులున్నారు.

 

CM Cup Begins with Grander in Bhikkhunur
CM Cup Begins with Grander in Bhikkhunur