పిట్లం, బతుకమ్మ: జుక్కల్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన ఇమ్రోజ్ ఆదివారం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇమ్రోజ్ ను సీఎం అ భినందించారు. రాష్ర్ట ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే కు సహకరించాలన్నారు.