నీట్‌లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు సీఎం అభినందనలు

  హైదరాబాద్, బతుకమ్మ :   నీట్‌ పరీక్షలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ విద్యా సంస్థల ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలల విద్యార్థులను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అభినందించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఉన్నతాధికారులతో కలిసి విద్యార్థులు హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నీట్‌లో సాధించిన విజయాలపై సీఎం విద్యార్థులను అభినందించి, వారి భవిష్యత్ విద్యా ప్రయాణానికి శుభాకాంక్షలు తెలిపారు. గురుకుల విద్యా సంస్థలు అందిస్తున్న నాణ్యమైన విద్య, విద్యార్థుల...