Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 May 2026, 5:45 pm Posted by : ramakrishna

చారిత్రాత్మక విజయం సాధించిన ఇషా ని అభినందించిన సీఎం

 

. . . ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ లో 43 హిట్స్ తో ప్రపంచ రికార్డు

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ – 2026 షూటింగ్‌లో అసాధారణ ప్రతిభ కనబరిచి చారిత్రాత్మక విజయం సాధించిన ఇషా సింగ్‌కు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గురువారం అభినందనలు తెలిపారు. మ్యూనిచ్‌లో జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్‌ మహిళల 25 మీటర్ల పిస్టల్ ఫైనల్లో 43 హిట్స్ సాధించి అద్భుతమైన స్కోర్‌తో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన ఇషా, సాధించిన విజయం భారత షూటింగ్ క్రీడా చరిత్రలో చిరస్మరణీయ ఘట్టంగా నిలిచిపోతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.  హైదరాబాద్‌కు చెందిన ఇషా సింగ్ తన అంకితభావం, క్రమశిక్షణ, పట్టుదలతో లక్షల మందికి స్ఫూర్తిగా నిలుస్తోందని ప్రశంసించారు. ఆమె అద్భుతమైన ప్రదర్శన భారత క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమని, భారత క్రీడల ఉజ్వల భవిష్యత్తుకు నిదర్శనమని అన్నారు. ఇషా సింగ్ భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని, ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఆమె దేశానికి మరింత కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు.