Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 September 2025, 7:51 pm Posted by : ramakrishna

సీఎం, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం

మద్నూర్, బతుకమ్మ: మొఘ-మద్నూర్ వెళ్లే రహదారి మార్గ మధ్యలో బ్రిడ్జి కూలిపోయి రాకపోకలకు గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఏఎంసి వైస్ చైర్మన్ పరమేష్ పటేల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఎమ్మెల్యే దృష్టికీ వచ్చిన  మూడు రోజులోనే   బ్రిడ్జి, ఒక కల్వోట్  30 లక్షలు మంజూరు చేయడం జరిగింది, అలాగే గ్రామానికి 35 లక్షలతో  సిసి రోడ్డు,10 లక్షలతో మురికి కాలువ కోసం గ్రామానికి మంజూరు చేయడం జరిగింది. గ్రామం ప్రజలకు అండగా ఉంటూ పనులు చేయించే ఇలాంటి ఎమ్మెల్యే మనకు రావడం మన అదృష్టంగా భావిస్తూ ఇందుకు గాను డోంగ్లీ మండల నాయకులు, మొఘ గ్రామ నాయకులు కార్యకర్తలు, గ్రామస్థులందరు కలిసి సిఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మికాంతారావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు, అనంతరం పరమేష్ పటేల్ మాట్లాడుతూ  బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు అధికారంలో ఉండి చేసింది ఏమీ లేదని అన్నారు. గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.