Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 June 2025, 6:55 pm Posted by : ramakrishna

కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖకు సీఎం, డీజీపీ అభినందనలు

కామారెడ్డి, బతుకమ్మ : ప్రజావాణి సమస్యల పరిష్కారంలో కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖను సీఎం, డీజీపీ అభినందించారు. దరఖాస్తులు అందిన వెంటనే విచారణ చేసి సమస్యలను పరిష్కరించిన రిపోర్టులను పై అధికారులకు పంపించారు. దీంతో జిల్లా నుంచి ఒక్కటి కూడా పెండింగ్ లో లేకుండా సమర్థవంతంగా పరిష్కరించడం వల్ల జిల్లా పోలీస్ శాఖకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ సందర్భంగా డీజీపీ జితేందర్ జిల్లా నోడల్ అధికారి అదనపు ఎస్పీ కే.నరసింహా రెడ్డిక ప్రశంసా పత్రం ద్వారా అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర కే.నరసింహా రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రజల సమస్యలను వేగంగా, నిష్పక్షపాతంగా  పరిష్కరించడం ద్వారా పోలీసులపై ప్రజల్లో నమ్మకాన్ని మరింత పెంచిందన్నారు.