జి.జి లో విద్యా వారోత్సవాల ముగింపు కార్యక్రమం

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   గిరిరాజ్ కళాశాలలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా 7వ రోజు విద్యావారోత్సవాల ముగింపు సమావేశంలో ఆదివారం ప్రతిభావంతులైన విద్యార్థులకు, అధ్యాపకులకు సన్మాన కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి. రామ్మోహన్ రెడ్డి తెలిపారు. సమన్వయకర్త డాక్టర్ రామస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన ముగింపు సమావేశంలో ఏడు రోజుల్లో జరిగిన కార్యక్రమాల రిపోర్ట్ వివరించారు.     రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిల్లో ప్రతిభ చాటుకున్న ఎన్.సి.సి. క్యాడెట్లను, ఎన్.ఎస్.ఎస్. వాలంటిర్లను, సెమిస్టర్ లలో మంచి...