Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 May 2026, 4:53 pm Posted by : ramakrishna

జి.జి లో విద్యా వారోత్సవాల ముగింపు కార్యక్రమం

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

గిరిరాజ్ కళాశాలలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా 7వ రోజు విద్యావారోత్సవాల ముగింపు సమావేశంలో ఆదివారం ప్రతిభావంతులైన విద్యార్థులకు, అధ్యాపకులకు సన్మాన కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి. రామ్మోహన్ రెడ్డి తెలిపారు. సమన్వయకర్త డాక్టర్ రామస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన ముగింపు సమావేశంలో ఏడు రోజుల్లో జరిగిన కార్యక్రమాల రిపోర్ట్ వివరించారు.

 

Closing ceremony of the Education Week celebrations in G.G.

 

రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిల్లో ప్రతిభ చాటుకున్న ఎన్.సి.సి. క్యాడెట్లను, ఎన్.ఎస్.ఎస్. వాలంటిర్లను, సెమిస్టర్ లలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులను, అకాడమిక్, రీసెర్చ్ అంశాలలో ప్రతిభ చూపిన అధ్యాపకులను కళాశాల ప్రిన్సిపాల్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్.రంగరత్నం, ఏ.వో.రామ్ కిషన్, కంట్రోలర్ భరత్ రాజ్, వినయ్ కుమార్, సమన్వయకర్తలు రామస్వామి, బాలమణి, రాజేశ్, దండు స్వామి, రంజిత, పూర్ణచందర్ రావు, కిరణ్ కుమార్ గౌడ్, ముత్తెన్న, అధ్యాపకులు నహీదా బేగం, నాగజ్యోతి, రమణ, దస్తప్ప, నరేశ్ కుమార్, సుధాకర్, రజిత, కార్యాలయ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

 

Closing ceremony of the Education Week celebrations in G.G.