వసతి గృహాల్లో పరిశుభ్రత పాటించాలి
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.రాజశ్రీ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : వసతి గృహాల్లో పరిశుభ్రతను పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.రాజశ్రీ సూచించారు. నాగారంలోని మైనార్టీ గురుకులాన్నిగురువారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డిఎంహెచ్వో మాట్లాడుతూ వసతి గృహాలు గురుకులాల్లో విద్యార్థులందరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ చక్కని ఆరోగ్య అలవాట్లు కలిగి ఉండాలన్నారు. వంట గదిలో, టాయిలెట్స్ లలో, హాస్టల్ పరిసర ప్రదేశాల్లో అపరిశుభ్రతపై, ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిసరాలు, మరుగుదొడ్లలో, వంట గదిలో...