Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 March 2025, 6:20 pm Posted by : ramakrishna

వసతి గృహాల్లో పరిశుభ్రత పాటించాలి

  • జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.రాజశ్రీ

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : వసతి గృహాల్లో పరిశుభ్రతను పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.రాజశ్రీ సూచించారు. నాగారంలోని మైనార్టీ గురుకులాన్నిగురువారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డిఎంహెచ్వో  మాట్లాడుతూ  వసతి గృహాలు గురుకులాల్లో విద్యార్థులందరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ చక్కని ఆరోగ్య అలవాట్లు కలిగి ఉండాలన్నారు. వంట గదిలో, టాయిలెట్స్ లలో, హాస్టల్ పరిసర ప్రదేశాల్లో అపరిశుభ్రతపై, ఆగ్రహం వ్యక్తం చేశారు.  పరిసరాలు, మరుగుదొడ్లలో, వంట గదిలో అపరిశుభ్రత వల్ల విద్యార్థులకు అంటువ్యాధులు ముఖ్యంగా చర్మ వ్యాధులైన గజ్జి, తామర, వంటివి సోకి ఒకరి నుండి ఒకరికి వ్యాపించి శారీరక మానసిక ఆస్వస్థతకు గురవుతారని తెలిపారు. వార్డెన్ అందుబాటులో ఉండి ప్రతిరోజు వీటన్నింటినీ చూసుకోవాలని కోరారు. వంట మనుషులను వంట సామాగ్రి తో పాటు కూరగాయలను శుభ్రమైన ప్రదేశంలో ఉంచుతూ వంట చేసేముందు కూరగాయలను నీటితో శుభ్రపరచుకోవాలని సూచించారు. మిగిలిన ఆహార పదార్థాలను, ఇతర వ్యర్థాలను మునిసిపాలిటీ చెత్త వాహనానికి ప్రతిరోజు తరలించాలని సూచించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించి విద్యార్థులకు జ్వరం, చర్మ వ్యాధులకు చికిత్స అందించారు. ఈ కార్యక్రమంలో పిఓఎన్సిడి డాక్టర్ సామ్రాట్ యాదవ్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సబియుద్దీన్, హెచ్ఈ ఓ గిరి బాబు, నాగరాజు, ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Cleanliness should be maintained in the hostels.