Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 June 2025, 11:00 pm Posted by : ramakrishna

వ్యాపార సముదాయాల్లో పరిశుభ్రత పాటించాలి

  • మున్సిపల్ కమీషనర్ గోపు గంగాధర్

 

భీమ్ గల్, బతుకమ్మ : పట్టణ మున్సిపల్ పరిధిలోని హోటల్లు, బేకిరీలు ఇతర అన్ని వ్యాపార సముదాయాల్లో పరిశుభ్రత పాటించాలని మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ సూచించారు. మంగళవారం మండల కేంద్రంలో ఆకస్మికంగా పలు హోటల్, బేకిరీ ఇతర దుకాణలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  పరిసరప్రాంతాలను శుభ్రముగా ఉంచుకొని యెడల వారికి జరిమానా విధించడం జరుగుతుందన్నారు.పట్టణ దుకాణదారులకు హోటల్స్, బేకరీ షాప్ యజమానులు ప్లాస్టిక్ కవర్ వాడవద్దన్నారు. కాదని వాడిన వారిపై మున్సిపల్ చట్టం-2019 ప్రకారం జరిమానా  విధించి చర్యలు తీసుకొవడం జరుగుతుందన్నారు.100 రోజుల కార్యాచరణలో భాగంగా 8వ వార్డులో జరుగుతున్న శానిటేషన్ పనులను ఆయన పర్యవేక్షించారు.  పట్టణములో రాబోయే వర్షాకాలం దృష్ట్యా ప్రధాన రహదారుల వెంబడి నీటిని నిల్వ ఉండకుండా చూసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.ఆయన వెంట మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.