కేబుల్ దొంగలకు దేహశుద్ధి

నవీపేట్, బతుకమ్మ : మండలం లోని ఫతేనగర్ శివారు వ్యవసాయ బోరు మోటారు కేబుల్ వైర్లను చోరీ చేస్తున్న దొంగలను రైతులు పట్టుకొని దేహశుద్ధి చేశారు. గ్రామ శివారులో గురువారం రాత్రి  వ్యవసాయ బోరు బావుల వద్ద నుంచి కేబుల్ వైర్లను చోరీ చేసి తీసుసుకెళ్తున్న ఇద్దరు యువకులను రైతులు పట్టుకుని కొట్టారు. పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలాని చేరుకొని ఇద్దరిని స్టేషన్ కు తరలించి విచారణ చేపట్టారు.