Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 January 2026, 4:37 pm Posted by : ramakrishna

సుల్తాన్ పేట్ లో మురికి కాలువలు శుభ్రం

మద్నూర్, బతుకమ్మ:

 

మండల కేంద్రంలోని సుల్తాన్ పేట్ గ్రామంలో మురికి కాలువను, పిచ్చి మొక్కలను పంచాయతీ కార్యదర్శి శుభ్రం చేయించారు. గ్రామం స్వచ్ఛంగా పరిశుభ్రంగా ఉండాలంటే గ్రామంలోని ప్రజలు వ్యర్థ పదార్థాలను ఇంటి చుట్టుపక్కల పడేయకుండా శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. పరిశుభ్రంగా ఉండడం వలన అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపొచ్చన్నారు. మురికి కాలువలోని పూడిక తీయించి దుర్వాసన, దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గ్రామం పరిశుభ్రంగా ఉండే విధంగా సహకరించాలని కోరారు.