రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితోనే వర్గీకరణ సాధ్యమైంది
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే ఎస్సీ వర్గీకరణ చేసినం తీర్పు వచ్చిన ఆరునెలల్లోనే బిల్లును ఆమోదించినం కామారెడ్డి, బతుకమ్మ : షెడ్యూల్డ్ కులాల నడుమ సాధికారత, సమానత్వం కోసమే వర్గీకరణ చేస్తున్నట్టు పిసిసి డెలిగేట్ సభ్యులు విట్టల్ రెడ్డి తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన గంటలోపే సీఎం రేవంత్ రెడ్డి వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని అసెంబ్లీలో ప్రకటన చేశారని గుర్తుచేశారు. దేశంలో వర్గీకరణ అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని అప్పట్లో ప్రకటించారని, ప్రస్తుతం ఆ మాటను నిలుపుకొన్నారని చెప్పారు. దళితుల దశాబ్దాల...