Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 February 2025, 4:31 pm Posted by : ramakrishna

వర్గీకరణ సాధనకు తరలిరావాలి

తాడ్వాయి, బతుకమ్మ : ఛలో హైదరాబాద్ ఎస్సీ వర్గీకరణ సాధనకై వేల గొంతులు లక్ష డప్పులు కదలి రావాలని మాదిగ రాజకీయ పోరాట సమితి ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు చిట్యాల సాయన్న, రాష్ట్ర ఉపాధ్యక్షులు భాగయ్య పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి గ్రామంలో డప్పులతో నినాదాలు చేస్తూ ఇంటింటికి తిరుగుతూ ఈనెల ఫిబ్రవరి 7వ తేదీన హైదరాబాదుకు ఇంటికొకరు తరలిరావాలని కోరారు. ఈ సందర్భంగా మాదిగ రాజకీయ పోరాట సమితి జిల్లా అధ్యక్షులు చిట్యాల సాయన్న రాష్ట్ర ఉపాధ్యక్షులు భాగయ్య  మాట్లాడారు. ఈనెల 7 వ తేదీన వేయి గొంతులు లక్ష డప్పులతో హైదరాబాద్లో జరిగే మహా గర్జనను విజయవంతం చేయాలని కోరారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎస్సీ మాదిగ వారిని కలిసి ఎస్సీ వర్గీకరణకు అందరం సహకరిస్తేనే ఎస్సీ వర్గీకరణ వెంటనే అమలవుతుందని చెప్పగానే హైదరాబాద్కు తాడ్వాయి గ్రామ మాదిగలు మూడు బస్సులలో వస్తామని చెప్పడం జరిగిందని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ సాధనకై ఎస్సీ మాదిగలు రావాలని ఊరు ఊరు చెప్పి అందర్నీ ఐక్యమత్యం చేయడం జరుగుతుందని తెలిపారు.