Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 March 2026, 8:10 am Posted by : ramakrishna

పదో తరగతి హింది ప్రశ్న పత్రం లీక్  

 

. .  . మూడు పరీక్ష కేంద్రాల నుంచి బయటకు వచ్చిన క్వశ్చన్ పేపర్

 

. .  . ఆన్ లైన్ లో ప్రత్యక్షమైన పేపర్లు

 

. . . 9 మంది ప్రభుత్వ ఉపాధ్యాయుల సస్పెన్షన్ 

 

 నిజామాబాద్, బతుకమ్మ :

 

నిజామాబాద్ జిల్లాలో పదవ తరగతి హింది ప్రశ్న పత్రం లీక్ అయింది. పరీక్ష కేంద్రాలలో క్వశ్చన్ పేపర్లను బయటకు తీసిన వెంటనే కొందరు వాట్సాప్ లలో ఇతరులకు షేర్ చేశారు. అవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. నిజామాబాద్ జిల్లా జెడ్ పి హెచ్ ఎస్ ఆలూర్, జెడ్ పి హెచ్ ఎస్ మెండోరా, గవర్నమెంట్ బోధన్ జూనియర్ కళాశాల నుంచి క్వశ్చన్ పేపర్ బయటకు వచ్చినట్టు గుర్తించారు. జిల్లా విద్యాశాఖ అధికారులతో విచారణ చేపట్టారు. అందుకు బాధ్యులైన ఆలూరు జడ్పీహెచ్ఎస్ గెజిటెడ్ హెడ్మాస్టర్ జి రాజేందర్, లలూర్ మండలం మచ్చర్ల జెడ్ పి హెచ్ ఎస్ స్కూల్ అసిస్టెంట్ విజయ్ కుమార్,, జెడ్పిహెచ్ఎస్ మిర్ధాపల్లి ఎస్జిటి పీ. ఉమేందర్, డీకంపల్లి మండల పరిషత్ అప్పర్ ప్రైమర్ స్కూల్ ఎస్ జి టి ఎన్ సాగర్, మెండోరా మండలం ఎస్సారెస్పీ జడ్పీ హైస్కూల్ హెచ్ఎం మమత, వెలగటూర్ జడ్పీహెచ్ఎస్ స్కూల్ అసిస్టెంట్ జి రవీందర్, ఎస్సారెస్పీ జడ్పిహెచ్ఎస్ స్కూల్ అసిస్టెంట్ సిహెచ్ భూపతి, బోధన్ మండలం పెంట కలర్ జిల్లా పరిషత్ హై స్కూల్ అసిస్టెంట్ కే వేణు, కల్దుర్కి జిల్లా పరిషత్ హై స్కూల్ స్కూల్ అసిస్టెంట్ శివానంద రావు లను బాధ్యులుగా గుర్తించి వారిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు.

Class 10 Hindi question paper leaked