మొదటి రోజు ప్రశాంతంగా పదో తరగతి పరీక్షలు
పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన ఉమ్మడి జిల్లా కలెక్టర్లు నిజామాబాద్, బతుకమ్మ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా ముగిసాయి. పరీక్షా కేంద్రాలను ఉమ్మడి జిల్లా కలెక్టర్ లు రాజీవ్ గాంధీ హనుమంతు, ఆశీష్ సాంగ్వాన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. విద్యార్థుల హాజరు, సిబ్బంది హాజరు గురించి ఆరా తీశారు. నిబంధనలకు అనుగుణంగానే నిర్ణీత సమయంలో ప్రశ్న పత్రాలను తెరిచారా? స్ట్రాంగ్ రూం ల...