భూ తగాదాలతో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ

  . . . పలువురికి గాయాలు   కామారెడ్డి, బతుకమ్మ :   కామారెడ్డి జిల్లా గాంధారి మండలం చెద్మల్ తండాలో భూ వివాదం నేపథ్యంలో రెండు కుటుంబాల మధ్య మంగళవారం ఘర్షణ చోటుచేసుకుంది. భూమికి సంబంధించిన తగాదాలు తీవ్రరూపం దాల్చడంతో ఇరు కుటుంబాలకు చెందిన సభ్యులు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఘర్షణలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ప్రభుత్వ ఆసుపత్రికి...