బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఐఎన్‌టీయూసీ ఇరువర్గాల మధ్య రసాభాస
పిడిగుద్దులతో దాడి చేసుకున్న ఇరువర్గాల నేతలు బషీర్‌బాగ్, బతుకమ్మ : బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఐఎన్‌టీయూసీ ఇరువర్గాల మధ్య రసాభాస నెలకొంది. ఐఎస్‌టీయూసీ సంజీవ్‌రెడ్డి వర్గం, అంబటి కృష్ణమూర్తి వర్గాల మధ్య గొడవ జరిగింది. ఇరువర్గాల నేతలు పిడిగుద్దులతో దాడి చేసుకున్నారు. సంజీవ్‌రెడ్డి వర్గీయులను అబిడ్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.