Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 May 2025, 7:25 pm Posted by : ramakrishna

హోటల్ మెహఫిల్ వద్ద ఘర్షణ

  • పాత కక్షలతో యువకుడి గొంతుకోసిండు

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :  నిజామాబాద్ నగరంలోని నెహ్రూపార్క్ ప్రాంతంలోని మహిపిల్ హోటల్ వద్ద ఘర్షణ జరిగింది. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో వినాయక్ నగర్ కు చెందిన సాయికుమార్, శివ అనే యువకులు బర్త్ డే పార్టీ ముగించుకుని మహిపిల్ హోటల్ లో టీ తాగేందుకు వెళ్లారు. అక్కడే వారి స్నేహితుడు అయిన సాయినాథ్ ఇద్దరిని పలుకరించాడు. అక్కడ హోటల్ పక్కన సందులో పిలిచి మాట్లాడుదామని బ్లేడ్ తో సాయికుమార్ గొంతును కోసాడు. ఇటీవల జరిగిన గణేష్ ఉత్సవాల్లో జరిగిన గొడవల్లో తనపై కేసు పెట్టాడన్న కక్షతోనే సాయినాథ్ ఈ ఘతుకానికి ఒడిగట్టాడు. గాయపడ్డ సాయికుమార్ ను నిజామాబాద్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు 1వ టౌన్ ఎస్ హెచ్ వో రఘుపతి తెలిపారు.

  • హోటల్ వద్ద ఘర్షణ.. కానిస్టేబుళ్ళకు మెమోలు..

నిజామాబాద్ నగరంలో శాంతిభద్రతల పర్యవేక్షణలో భాగంగా రాత్రి 10 గంటల తర్వాత హోటళ్ళు, వ్యాపార సముదాయాలు మూసివేయాలని కమిషనర్ సాయిచైతన్య ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెల్సిందే. నగరంలో పలువురు వ్యాపారులు సిటి పోలీసు యాక్టు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి జైలుకు కూడా పంపించారు. అయితే నగరంలోని బోధన్ రోడ్డులోని ప్రధాన రహదారిలో హోటళ్లు, దాబాలు, టీ స్టాల్స్ రాత్రివేళ తెరిచి దందా నిర్వహిస్తున్నారు. సోమవారం రాత్రి కూడా బోధన్ రోడ్డులోని మహిపిల్ హోటల్ తెరిచి ఉండగా అక్కడ ఘర్షణ జరిగింది. యువకుడి పై హత్యాయత్నం జరిగింది. ఈ విషయంలో సీరియస్ గా ఉన్న పోలీసు అధికారులు పెట్రోలింగ్ నిర్వహించే కానిస్టేబుళ్ళకు మెమోలు జారీ చేశారు. ఇదే విషయమై నగర 1వ టౌన్ ఎస్ హెచ్ వో రఘుపతిని వివరణ కోరగా రాత్రి దందా నిర్వహిస్తున్న వారికి ముందుగా నోటీసులు ఇస్తామని తర్వాత కేసులు నమోదు చేస్తామని తెలిపారు.