. . . కత్తుల తో పరస్పర దాడులు
. . . ఇద్ధరికి తీవ్ర గాయాలు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:
నిజామాబాద్ నగరంలోని హైమద్ పుర కాలనీలో అదివారం రాత్రి రెండు గ్రూప్ లు ఘర్షణకు దిగాయి. రెండవ టౌన్ పరిధిలోని హైమద్ పుర కాలనీలోని నసీర్ హోటల్ చౌరస్తాలో గంజాయి బ్యాచ్ కు, స్థానిక యువకులకు మద్య జరిగిన ఘర్షణ కాస్త కత్తి పోట్లకు దారి తీసింది. ఈ ఘటనలో సాజీద్ అనే యువకుడికి, జాహేద్ ఖాన్ అను మరో యువకులకు సంబందించిన వారు గంజాయి తాగే విషయంలో, అడ్డా విషయంలో ఘర్షణ పడ్డారు. జాహేద్ ఖాన్ కు సంబందించిన సోధరులు కత్తితో వచ్చి దాడి చేయడంతో గోడవ పెద్ధదిగా మారింది. గాయపడిన సాజీద్ ఖాన్ కు సోధరుడు వచ్చి ఎదురు దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్ధరికి కత్తులతో జరిపిన దాడిలో గాయాలు అయ్యాయి. ఇరువురు జిల్లా జనరల్ ఆసుపత్రిలో వైద్యం పోందుతున్నారు. పరస్పరం స్థానిక పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసుకున్నారు. పోలీస్ శాఖ ఓక వైపు నిజామాబాద్ నగరంలో ఆపరేషన్ టప్ప చభుత్ర నిర్వహించి రాత్రి వేళ అసాంఘిక శక్తుల, సంఘ విద్రోహ శక్తుల , అకతాయిల, జూలాయిల సంచారంపై ఉక్కుపాధం మొపుతుంటే రౌడి షీటర్లు, సస్పెక్ట్ షీట్ ఉన్నవారు, గంజాయి పేడ్లర్లు మాత్రం రెచ్చిపోతున్నారు. ఆపరేషన్ టప్ప చభుత్ర పాటు కార్డన్ సెర్చ్ లు నిర్వహిస్తే గాని కత్తుల (నైప్ ) కల్చర్ కు చరమ గీతం పాడే అవకాశం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
